ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో.. ఏప్రిల్ 27 న రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా అవెంజర్స్ – ఇన్ ఫినిటీ వార్ .. అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది. మార్వెల్ కామిక్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా, ట్రైలర్ రిలీజ్ అయ్యిన వెంటనే .. అత్యధిక వ్యూస్ సాధించింది. ఆంటోనీ రూసో – జో రూసో ద్వయం దర్శకత్వం వహించిన, ఈ భారీ గ్రాఫిక్స్ చిత్రం లో .. పిల్లలకు ఎంతో ఇష్టమైన మార్వెల్ కామిక్స్ లోని పాత్రలు స్పైడర్ మాన్, ఐరన్ మాన్, బ్లాక్ పాంథర్, హల్క్, విజన్, కెప్టెన్ అమెరికా, డాక్టర్ స్ట్రేంజ్, బ్లాక్ విడో, గార్డియన్స్ అఫ్ గాలక్సీ లోని.. లోకి, గమోర మొదలగు పాత్రలు ఈ సినిమాలో కనపడతాయి.
కథ: దుర్మార్గుడైన థనోస్ భూ గ్రహం మీద సగం జనాభా ని చంపేసి, భూమిని కాపాడాలనుకుంటాడు. అందుకు గాను.. అతనికి 6 మహిమగల మణులు కావాలి. ఆ మణులను సంపాదించే క్రమంలో.. ఒక్కో సూపర్ హీరోని అతను ను చంపేస్తుంటాడు. వాళ్ళ దగ్గర ఉన్న మణులను చేజిక్కించుకుంటాడు. థనోస్ నుండి భూమిని కాపాడటానికి, అవెంజర్స్ అందరూ ఏకమయ్యి ఎం చేసారు?.. అనేది కథ!
విశ్లేషణ: అవెంజర్స్ సినిమాల్లో అందరూ బాగా నటిస్తారు, ఈ సినిమాలో కూడా అందరూ బాగా నటించారు. ముఖ్యంగా థోర్, ఐరన్ మాన్, డాక్టర్ స్ట్రేంజ్ మరియు థనోస్ లకు మంచి పాత్రలు లభించాయి. హల్క్ కి, స్పైడర్ మాన్ కి, ఈ సినిమాలో చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేవు. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో గుంపులుగా వచ్చి యుద్ధం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. థనోస్, గమోర మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఈ సినిమా లో అక్కడక్కడా బోర్ కొడుతుంది.తెలుగులో చూసినా కూడా .. బోర్ కొట్టిందంటే ! ఇంక ఇంగ్లీష్ లో చుసిన వాళ్ళ పరిస్థితి ఏంటో? థనోస్ కు ‘రానా’ తెలుగులో అందించిన గాత్రం అంతగా సూట్ అవ్వలేదు. శ్రీనివాస మూర్తి గారు డబ్బింగ్ చెప్పి ఉంటె ఆ పాత్రకు మరింత గాంభీర్యం ఖచ్చితంగా వచ్చేది. 3డీ ఎఫెక్ట్స్ మరిన్ని పెట్టి ఉంటె బాగుండును.ఉన్న 3డి ఎఫెక్ట్స్ అంత గొప్పగా అనిపించవు. రెండు వేరు వేరు కథలు సమాంతరంగా నడపటం లో దర్శకులు విఫలం అయ్యారు. క్లైమాక్స్ లో యుద్ధం చూస్తుంటే నిద్ర రావటం ఖాయం. సరైన ముగింపు కూడా లేని ఈ సినిమా, మధ్యలో ఆగిపోయి .. సీక్వెల్ ఉంటుందని చెపుతుంది.
ప్లస్ పాయింట్స్:
అద్భుతమైన గ్రాఫిక్స్ .
విలన్ – థనోస్.
యుద్ధ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్ :
రానా గాత్రం విలన్ కు సూట్ కాలేదు.
సినిమా స్క్రీన్ ప్లే.
సరైన ముగింపు లేకపోవడం.
ఒక్కసారి పిల్లల్తో కలిసి హాయిగా చూడొచ్చు.



