అయ్యప్పనమ్ కోషియం రీమేక్ స్టార్ కాస్ట్ ఫైనల్?

Ayyappanum Koshiyum Cast and Crew
అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ అక్టోబర్‌లో ప్రకటించారు… ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజు మీనన్ పాత్రలో నటించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ప్రకటించిన నాటి నుండి పవన్ కళ్యాణ్ పేరు తప్ప ఇంకో పేరు ఈ సినిమాకు ప్రకటించలేదు.

సినిమాలోని ఇతర తారాగణం కూడా ఇప్పుడు ఖరారు అయిందని మనకు ఉన్న విశ్వసనీయ సమాచారం. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి రెండవ కథానాయకుడిగా నటించనున్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా కంఫర్మ్ అయ్యారని కూడా మనకున్న సమాచారం.

ADVERTISEMENT

విరాటపర్వం తరువాత రానా, సాయి పల్లవి కలిసి నటించడం ఇది రెండోసారి అవుతుంది. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి మెగాఫోన్‌ ను పట్టుకోనున్నారు. ఈ ఏడాది నితిన్ భీష్మతో పెద్ద హిట్ సాధించిన సీతారా ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తోంది.

ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు. అతను ఇప్పటికే పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ కోసం సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి డైలాగ్ వెర్షన్ త్రివిక్రమ్ రాస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

ADVERTISEMENT
Latest Stories