పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం, అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ ఈ నెలలోనే సెట్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 35-50 రోజుల్లో పూర్తి చేసెయ్యాలని మేకర్స్ యోచిస్తున్నారు. షూటింగ్‌లో ఎక్కువ భాగం పొల్లాచిలో జరుగుతుంది. అక్కడ కొన్ని నచ్యురల్ లొకేషన్లలో అలాగే రెండు మూడు సెట్లలో సినిమా షూట్ చేస్తారు.
అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ డైరెక్టర్ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సెంటిమెంట్ తెరమీదకు తెస్తున్నారు. “పవన్ కళ్యాణ్ జల్సా తో స్టార్ డైరెక్టర్ అయ్యారు త్రివిక్రమ్. అది ఆయన మూడవ చిత్రం. గబ్బర్ సింగ్ తో పెద్ద డైరెక్టర్ అయ్యాడు హరీష్ శంకర్. అది కూడా అతని మూడవ చిత్రం. ఇది సాగర్ మూడవ చిత్రం,” అంటున్నరు వారు.
సాగర్ పెద్ద డైరెక్టర్ అవ్వడంతో పాటు… జల్సా, గబ్బర్ సింగ్ మాదిరిగా ఈ సినిమాకు పెద్ద హిట్ అవుతుందని వారు ఆశపడుతున్నారు. మరోవైపు.. తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని ఒరిజినల్ కన్నా కొంచెం తక్కువ నిడివిలో ఉండేలా చూడాలని చిత్రబృందం యోచిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని తెలుగులో కొన్ని మార్పులు చేస్తారట. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించే అవకాశం ఉంది. ఈ రీమేక్ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గా ఉన్నారు.





