500 కోట్లు బిజినెస్ దాటిన ‘బాహుబలి 2’

Baahubali 2 Business Is 500 Croresటాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘బాహుబలి 2’ పోస్టు ప్రొడక్షన్ సమయానికే 500 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిందని ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేశ్ బాల ట్వీట్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 500 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసిందని, డిస్ట్రిబ్యూషన్‌, శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా ‘బాహుబలి-2’ 500 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్వీట్‌ చేశారు.

తాజాగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘బాహుబలి 2’ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 180 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ‘బాహుబలి-ద బిగినింగ్’కు సీక్వెల్ గా రానుంది. ఈ సినిమా తొలి భాగం 600 కోట్ల వసూళ్లు సాధించి భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కడంతో, ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘బాహుబలి 2’ ఏకంగా 1000 కోట్లు సాధిస్తుందన్న అంచనాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories