‘బాహుబలి 2’ కోసం భారీ రిస్క్?

Baahubali 2 Conclusion overseas rightsనో డౌట్… కట్టప్ప ‘బాహుబలి’ని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న జాతీయ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. అయితే ఒక్కసారి సినిమా విడుదలైన తర్వాత, దీనికి లభించే సమాధానం ‘బాహుబలి 2’ ఫేట్ ను కూడా డిసైడ్ చేయవచ్చు. అయితే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు ట్రేడ్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. దేశీయ మార్కెట్ లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ‘బాహుబలి 2’ కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ రిస్క్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

‘బాహుబలి’ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ బట్టి, ‘బాహుబలి 2’ను కొనుగోలు చేయడం డిస్ట్రిబ్యూటర్ల వంతవుతోంది. అయితే ‘బాహుబలి’ సినిమా ఆయా ఏరియాలలో ఎంతైతే వసూలు చేసిందో, అంతకు మించిన మొత్తాన్ని పెట్టి ఈ ‘బాహుబలి 2’ను కొనుగోలు చేస్తున్నారు. అంటే ‘బాహుబలి’ సాధించిన కలెక్షన్స్ కు రెండింతలు సాధిస్తే గానీ, ఆయా డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలు ఆశించలేని పరిస్థితి. దేశీయంగా ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో సాగగా, తాజాగా ఓవర్సీస్ (యుఎస్ఎ+కెనడా) ధియేటర్ హక్కులను దాదాపుగా 45 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ADVERTISEMENT

ఇంత పెద్ద మొత్తం అనేది బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని విషయం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీని తిరిగి రాయడానికి ‘బాహుబలి 2’ సిద్ధంగా ఉందనేది నిజం. అయితే అంత మొత్తంలో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ నష్టాలు రాకుండా బయటపడాలంటే ‘బాహుబలి 2’ దాదాపుగా 9.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. మరి ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ గమనిస్తే… దాదాపుగా 7.5 మిలియన్ డాలర్స్ గా నమోదైంది. దీంతో ఫస్ట్ పార్ట్ ను మించి వసూలు చేసినా… అది బ్రేక్ ఈవెన్ కు మాత్రమే సరిపోనుంది. లాభాలు రావాలంటే అంతకు రెండింతలు కలెక్ట్ చేయాల్సిందే!

ఒక రకంగా ఆలోచిస్తే… ‘బాహుబలి 2’కు జరుగుతోన్న బిజినెస్ ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. మరి అంతటి రిస్క్ చేసిన డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని నిలబెట్టి, సరికొత్త చరిత్రకు ‘బాహుబలి 2’ వేదిక అవుతుందా? కనివినీ ఎరుగని విధంగా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలబడుతుందా? దీనికి సమాధానం లభించాలంటే ఏప్రిల్ 28వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. అయితే ఆ నమ్మకం కలిగించడానికి ఈ నెల 22వ తేదీనే ఓ చిన్న టీజర్ రూపంలో యంగ్ రెబెల్ స్టార్ దర్శనమివనున్నాడు.

ADVERTISEMENT
Latest Stories