యంగ్ రెబల్ స్టార్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న “బాహుబలి 2” ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ముందుగా ధియేటర్లలో, ఆ తర్వాత సాయంత్రం సమయానికి సోషల్ మీడియాలో విడుదల చేసే విధంగా ప్లానింగ్ చేసారు. మొత్తం నాలుగు భాషలలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేసారు.
అయితే ఇంకా ధియేటర్లలో ప్రదర్శన ప్రారంభం కాకముందే, సోషల్ మీడియాలో “బాహుబలి 2” ట్రైలర్ ప్రత్యక్షమైంది. తమిళ వర్షన్ కు చెందిన ఈ ట్రైలర్ మొత్తం విడుదల కావడంతో, సోషల్ మీడియాలో హవా అంతా ప్రస్తుతం ‘బాహుబలి 2’ ట్రైలర్ దే! ఇంకా ధియేటర్లలో విడుదలైన తర్వాత, బహుశా తెలుగు ట్రైలర్ కూడా సోషల్ మీడియాకు ఎక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇదేమీ ముందుగా ఊహించనది కాదు. ‘బాహుబలి 2’ సినిమాపై ఉన్న క్రేజ్ రీత్యా, అఫీషియల్ రిలీజ్ కంటే ముందే ఖచ్చితంగా సోషల్ మీడియాలో లీక్ అవుతుందని భావించినా, ఇంత తొందరగా వస్తుందని అయితే అంచనా వేయలేదు. ఇంతకీ ఈ ట్రైలర్ టాక్ ఎలా ఉందనే ప్రశ్న అడుగుతున్నారా? తినబోతు రుచి ఎందుకు… అధికారికంగా విడుదలయ్యే సమయం వరకు వేచిచూస్తే, వచ్చే కిక్కే వేరు కదా!



