‘బాహుబలి 2’ ట్రైలర్ లో షాట్ – అదుర్స్!

అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చెప్పేయొచ్చు అంటుంటారు పెద్దలు. అలాగే “బాహుబలి 2” ట్రైలర్ ఎలా ఉండబోతుందో అనే దానికి నిదర్శనంగా ఒక్క షాట్ ను వదిలారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ షాట్ ను చూసిన ఎవరైనా ‘కెవ్వు కేక’ అనాల్సిందే… అనిపించే విధంగా ఉంది. ప్రభాస్ ఫేస్ లోని సగం కటౌట్ ను మాత్రమే చూపించిన రాజమౌళి టేకింగ్ తో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయిపోవడం ఖాయమనే చెప్పవచ్చు.

ADVERTISEMENT

“మరో మూడు రోజుల్లో ట్రైలర్ రాబోతోంది” అంటూ సోషల్ మీడియాలో ఈ షాట్ ను రాజమౌళి రిలీజ్ చేసారు. యంగ్ రెబల్ స్టార్ లుక్ అలా ఉంటే, ఆ సీన్ ను తన బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో ఎలివేట్ చేసాడు కీరవాణి. మొత్తానికి రాజమౌళి ఇచ్చిన శాంపిల్ వీడియో వీక్షకులలో “బాహుబలి 2” ట్రైలర్ ను ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిందని చెప్పవచ్చు. చూడబోతుంటే… ఈ సారి ‘బాహుబలి’ విధ్వంసం ఖాయంగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories