గత రెండు సంవత్సరాలుగా “బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమా షూటింగ్ లో పాల్గొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇటీవలే ఆ సినిమా నుండి బయటకు కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ‘బాహుబలి’ సినిమా ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, ప్రభాస్ ఇంకా ‘బాహుబలి’ గెటప్ లోనే ఉన్నారన్న విషయం ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది.
గోపీచంద్ హీరోగా ‘జిల్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ వివాహానికి హాజరైన ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నూతన వధూవరులకు ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తూ కనపడిన ప్రభాస్ లుక్ అదిరిపోయే విధంగా ఉండడంతో, చుట్టూపక్కల ఉన్న కెమెరా కళ్ళన్నీ, ఈ ‘బాహుబలి’ మీదే పడ్డాయన్న విషయం ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది. సింపుల్ లుక్ లో ‘యంగ్ రెబల్ స్టార్’ అదిరిపోయాడు మరి!
పెళ్ళికొడుకు రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ‘జిల్’ సినిమాను నిర్మించింది ప్రభాస్ స్నేహితులైన వంశీ కృష్ణ రెడ్డి మరియు ఉప్పలపాటి ప్రమోద్ అన్న విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్ పై నిర్మాణం అయిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ నటించగా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థ లాంటిది కావడంతో, ఆ అనుబంధంతోనే రాధాకృష్ణ వివాహానికి ప్రభాస్ హాజరయ్యారు.



