‘బాహుబలి’ స్పూఫ్ వీడియో… బాగా వాడినట్టున్నారు..!

Baahubali spoof - Uttarkhand CM Narendra Modiమన రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగమయ్యాడు. ఈ సినిమాలో శివుడి పాత్ర శివలింగాన్ని పెకిలించే సన్నివేశాన్ని గ్రాఫిక్స్ తో మార్చేసి, ప్రభాస్ పాత్రలో ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ ను జోడించి తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో తనికెళ్ల భరణి స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉంచడం గమనార్హం.

ఆపై అమిత్ షా వంటి వారినీ చేర్చారు. శివలింగం స్థానంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఉంచినట్టు చూపించిన ఈ వీడియోను ‘యూపీ/యూకే లైవ్’ పోస్టు చేసింది. రాష్ట్రాన్ని కాపాడే రక్షకుడు హరీశ్ రావత్ మాత్రమేనంటూ టైటిల్ పెట్టింది. కాగా, ఈ వీడియో గురించి తనకు సమాచారం లేదని ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories