“బాహుబలి” యూనిట్ నుండి ‘తీపికబురు’

baahubali-the-conclusion-shooting-and-post-production-starts2017వ సంవత్సరం ఓ మిస్టరీని చేధించబోతోంది. అదే ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారు?’ అన్న 600 కోట్ల విలువైన ప్రశ్నకు సమాధానం లభించనుంది. ఇంకో రకంగా చెప్పాలంటే… ఈ ప్రశ్నకు సమాధానమే… 1000 కోట్లు కలెక్షన్స్ సాధించే తొలి చిత్రంగా దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. మరి ఇంతటి భారీ అంచనాలు ఉన్న “బాహుబలి – ది కన్ క్లూజన్” ఎప్పుడు విడుదల అవుతుందో అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా సమయం కావాల్సి ఉన్నందున, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందోనని ‘యంగ్ రెబల్ స్టార్’ అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయితే, మరో కొత్త గెటప్ లో ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభించనున్న నేపధ్యంలో… ‘బాహుబలి’ చిత్ర యూనిట్ నుండి తీపికబురు అందించింది. శుక్రవారం నాడు అంటే జనవరి 6వ తేదీనే “బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమాకు ‘గుమ్మడికాయ’ కొట్టబోతున్న రోజు.

ADVERTISEMENT

దాదాపుగా రెండేళ్ళ పాటు చిత్ర యూనిట్ అహర్నిశలు శ్రమించగా, మరో మూడు నెలల పాటు అదే శ్రమను సాంకేతిక విభాగం ఫేస్ చేయనుంది. ఆ తర్వాత మార్చి చివరి వారంలో గానీ, ఏప్రిల్ మొదటి వారంలో గానీ ఆడియో విడుదల జరుపుకుని, ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానుంది. ‘బాహుబలి’ మాదిరే తదనంతర కాలంలో అనేక భాషల్లోకి ఈ సినిమా కూడా అనువాదం కానుంది.

ADVERTISEMENT
Latest Stories