నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి తర్వాత నిలిచిపోయింది. పాండమిక్ తరువాత షూటింగ్ గురించి చిత్రబృందం ఇంకా ప్రకటన చేయలేదు. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను జెమిని టివి దక్కించుకున్నట్లు నివేదికలు వస్తున్నాయి.
ఈ హక్కులు ద్వారా నిర్మాతలకు 11.5 కోట్లు వరకూ వచ్చి పడ్డాయి అని మనకున్న సమాచారం. మరోవైపు, సినిమా యొక్క డిజిటల్ హక్కులకు మరో 9 కోట్లకు లభించాయి. ఈ చిత్రం షూటింగ్ రేపు (అక్టోబర్ 29) నుండి తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. మిరియాల రవీందర్ రెడ్డి తన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. డిక్టేటర్ తర్వాత బాలయ్యతో కలిసి పని చెయ్యడం థమన్ కు ఇది రెండోసారి. జూన్‌లో విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంపై హైప్ మరియు అంచనాలు సూపర్ లెవెల్ లో ఉన్నాయి. ఈ చిత్రం సమ్మర్ 2021 లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా మేకర్స్ మొదట్లో ఒక కీలక పాత్ర కోసం సంజయ్ దత్ ను కోరుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన అనారోగ్యం కారణంగా అది సాధ్యం కాదు. కాబట్టి, వారు దాని కోసం సోను సూద్ ను ఎంచుకున్నారట. సోను సూద్ కు ప్రస్తుతం ఉన్న పాపులారిటీ చిత్రానికి కూడా హైప్ తెస్తుంది. కాబట్టి అన్ని రకాల ఇది మంచి నిర్ణయమే అని చెప్పుకోవాలి.




