నందమూరి నటసింహం “డిక్టేటర్” ద్వారా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బాలయ్య ఇచ్చిన ప్రకటనలు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తన వ్యవహార తీరుకు సంబంధించి బాలకృష్ణ చేసిన ప్రకటనలు ఓ స్పష్టమైన సమాచారాన్ని ఇస్తున్నాయి.
“నాలో క్షమించే గుణం తక్కువే, ఏ విషయంలోనైనా ఎవరైనా తప్పు చేస్తే క్షమించను. బుజ్జగించడం అలాంటివి నాకస్సలు ఇష్టం లేవు. ఏదైనా ఒక్కసారే. అంతే. ఏదైనా సరే నా స్టైల్లో డీల్ చేస్తాను. వాళ్లకు రెండో అవకాశం ఇవ్వను. అక్కడితో కటాఫ్ అంతే. అది ఇంట్లో వాళ్ళయినా, బయటి వాళ్ళయినా… అంతే!”
ఈ సమాధానం ఎవరిని ఉద్దేశించి చేసారో బహుశా ఇప్పటికీ పాఠకులకు అర్ధమై ఉంటుంది. అందుకే బాలయ్య ప్రకటనలు ఇంత చర్చనీయంశమయ్యాయి. ముక్కుసూటి మనస్తత్వంతో బాలయ్య ఇచ్చే ప్రకటనలు నిజంగానే “డిక్టేటర్” అన్న పదానికి
సార్ధకంగా ఉన్నాయనిపించడం సహజమే!





