నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా షూటింగ్ ఇటీవలే మొరాకోలో ప్రారంభమైన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోరాట సన్నివేశాలను మొరాకోలో చిత్రీకరిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఆర్టిస్టులతో కలిసి షూటింగ్ చేస్తున్న ఈ చిత్ర యూనిట్ విరామ సమయంలో భోజనాలు చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
మీసాలు పెంచిన బాలయ్య బాబు ప్లేట్ పట్టుకుని ఐటమ్స్ చూస్తుండగా, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లతో పాటు, ఇతర తారాగణం, చిత్ర యూనిట్ సభ్యులు అంతా కలిసి మూకుమ్మడిగా భోజనాలు చేస్తుండడం విశేషం. మొరాకో వెళ్ళినా ఇండియన్ ఫుడ్ ను వండించుకుని మరీ చిత్ర యూనిట్ ఆహారం తీసుకుంటున్నట్లుగా ఈ ఫోటోలలోని మెనూ స్పష్టం చేస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



