మన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడే

Balakrishna Honoured with Padma Bhushan, World Book of Records

హిందూపురం టీడీపి ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుతో సన్మానించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మన బాలయ్యకు మరో అరుదైన పురస్కారం లభించింది. సినీ పరిశ్రమలో 50 ఏళ్ళపాటు అనేక సినిమాలలో నటించి మెప్పించినందుకు బాలయ్య పేరుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో చేర్చుతున్నట్లు దాని నిర్వాహకులు లేఖ ద్వారా తెలియజేశారు.

ADVERTISEMENT

భారతీయ సినీ పరిశ్రమ నుంచి ఆ రికార్డ్ సాధించిన ఏకైక నటుడు మన బాలయ్యే. సినీ పరిశ్రమలో హాఫ్ సెంచరీ కొట్టిన బాలయ్యకి ఈ నెల 30న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు సత్కరించనున్నారు.

బాలకృష్ణ 1974లో తాతమ్మ కలతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఆయన పౌరాణికం, జానపదం, సాంఘికం, సోషియో ఫ్యాంటసీ, బయో పిక్, కమర్షియల్… ఇలా బాలయ్య చేయని జోనర్ లేదంటే అతిశయోక్తి కాదు.

నాటికీ నేటికీ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల హృదయాలలో నిలిచే ఉన్నారు. అయన కుమారుడు బాలకృష్ణ కూడా సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు నటించడం మామూలు విషయం కానే కాదు.

యాబై ఏళ్ళుగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ నేటికీ బాలయ్యలో అదే క్రమశిక్షణ…. అదే ఉత్సాహం కనిపిస్తుంటుంది. నేటికీ సూపర్ హిట్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు పెద్ద హీరోలు రెండు మూడేళ్ళకు ఓ సినిమా చేస్తుంటే బాలయ్య మాత్రం ఇక నుంచి ఏడాదికి మూడు సినిమాలు చేస్తానని చెప్పారు. బాలయ్య ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడే!

ADVERTISEMENT
Latest Stories