‘బాలయ్య – మహేష్’ల మల్టీస్టారర్ సినిమా ఆన్ కార్డ్స్?

balakrishna-mahesh-babu-multi-starer-movie‘మల్టీస్టారర్’ సినిమాలు చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధమే అని అందరూ హీరోలు ప్రకటిస్తారు, కానీ తీరా సందర్భం దగ్గరికి వచ్చే సరికి వెనకడుగు వేయడం షరామామూలే. దీంతో తెలుగు సినీ తెరపై అగ్ర హీరోల మల్టీస్టారర్ సినిమా అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసి, సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత ప్రిన్స్ మహేష్ బాబుకే సొంతమైంది. అలాంటి ప్రిన్స్ మరోసారి భారీ మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే ట్రేడ్ వర్గాలు అవుననే అంటున్నాయి.

ADVERTISEMENT

కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా జనవరిలో ఓ చిత్రం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఉన్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల బాలయ్యకు కధ వినిపించిన కొరటాలకు సూచనప్రాయంగా బాలయ్య అంగీకారం తెలిపినట్లుగా టాక్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్ పాత్రలో బాలకృష్ణను ఎంపిక చేస్తే బాగుండేదన్న టాక్ ఇటీవల హల్చల్ చేసిన నేపధ్యంలో, బాలయ్య పేరు తెరపైకి రావడం ప్రాధాన్యతను దక్కించుకుంది.

మరి రొటీన్ గా సినీ వర్గాల్లో సందడి చేసే పుకార్లలో భాగమో లేక నిజంగా బాలయ్య – మహేష్ ల కాంభినేషన్ సెట్ అవుతుందో గానీ, ఈ వార్తలు సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలోనూ ఓ సందర్భంలో మహేష్ – బాలకృష్ణలపై ఓ సినిమా అంటూ పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం సందడి చేస్తున్న ఈ వార్తలపై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందోనని ఇరు హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ‘శ్రీమంతుడు’ సినిమా సందర్భంలో కూడా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నపుడు స్వయంగా కొరటాల శివే వాటిని నివృత్తి చేసారు. దీంతో అందరి చూపులు కొరటాల వైపుకే..!

ADVERTISEMENT
Latest Stories