సచీ దర్శకత్వంలో రూపొందిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ దక్కించుకున్నారని ఇప్పటికే తెలిసిందే.
ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని అనుకుంటున్నట్టు మొన్న ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇందులో ఇంకో హీరో పాత్రకు యువ హీరో అవసరం. ఆ పాత్ర కోసం మంచు విష్ణుని అనుకుంటున్నట్టు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు మంచు ఫ్యామిలీ టీడీపీపై దండయాత్ర చేసింది. మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోయారు.
ఈ వ్యవహారమంతా విష్ణునే చూసుకున్నాడు. విష్ణు భార్య వెరోనికా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరి చుట్టం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య ఈ సినిమా చేస్తాడా? చేస్తే చంద్రబాబు నాయుడు, టీడీపీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమాకు డైరెక్టర్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
సితార ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది. బాడ్ సీజన్ లో రిలీజ్ కాకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది ఆ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ ప్రస్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌లతో రంగ్‌దే, నానితో శ్యామ్ సింగరాయ్. నాగశౌర్యతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్‌దే జులై 30న, శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 25న (క్రిస్మస్ సందర్భంగా) విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.





