పవన్ కళ్యాణా? ఎవరతను? నాకు తెలియదు!

Nandamuri Balakrishna Responds On Legend Nandi Controversyఏంటి… ఈ డైలాగ్స్ అన్నది ఎవరు? అన్న సందేహం వచ్చిందా? ఆయన మరెవరో కాదు… నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న సమాధానం వెలువడుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి మీడియా వర్గాలు బాలకృష్ణను ప్రశ్నిస్తున్న సందర్భంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి.

విశాఖలో టీఎస్సార్ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న బాలయ్యను మీడియా వర్గాలు ప్రశ్నించే క్రమంలో… “పవన్ కళ్యాణా? ఎవరతను? నాకు తెలియదు” అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మైండ్ బ్లాక్ అవ్వడం మీడియా వంతయ్యింది. బాలయ్యకు నిజంగానే పవన్ కళ్యాణ్ తెలియదా? అంటే… ఇది ఫేక్ వీడియో అని కొందరు అంటుంటే, మీడియా వర్గాల ప్రశ్నలను వదిలించుకోవడం కోసం ఈ విధంగా మాట్లాడి ఉంటారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ADVERTISEMENT

కారణం ఏదైనా గానీ… బాలయ్య పేరుతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒకవేళ బాలకృష్ణ స్వయంగా అన్నా కూడా, ఎవరూ సీరియస్ గా పరిగణించరన్న విషయం తెలిసిందే. రాజకీయ వేదికలపై అయినా… సినీ వేడుకలలో అయినా… బాలయ్య రూటే సపరేటు..! దానికి అడ్డు చెప్పే వారు గానీ, ప్రశ్నించే వారు గానీ ఎవరు ఉండరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! మరి పవన్ కళ్యాణ్ నుండి దీనికి కౌంటర్స్ వస్తాయేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories