నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు భాష ఉచ్ఛారణకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. అచ్చమైన తెలుగుతో పాటు స్పష్టమైన సంస్కృతం పలకగల ఏకైక హీరో బాలకృష్ణ. అలాంటి బాలయ్య తన నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
హిందూపూర్ లో ఈ నెల 27, 28 తేదీలలో ‘లేపాక్షి ఉత్సవాల’ పేరుతో ఏపీ ప్రభుత్వం మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. టూరిజంను అభివృద్ధి చేయడం కూడా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీంతో దీనికి సంబంధించిన ప్రచార బాధ్యతను బాలకృష్ణ తీసుకుని, ఓ వీడియో రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
లేపాక్షి ఉత్సవాల ఉద్దేశం, దేవాలయాల విశిష్టతతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ లో సందడి చేస్తోంది. అందరూ భాగస్వామ్యులు కావాలని కోరుతున్న ఈ ఉత్సవాలలో రెండు రోజుల పాటు ఏయే కార్యక్రమాలు ఉంటాయో కూడా బాలయ్య తెలియజేసారు. ఈ వీడియోను చూసిన నందమూరి నటసింహం అభిమానగణం బాలయ్య చెప్పారంటే… వెళ్ళాల్సిందేగా అంటున్నారు.





