ట్రైలర్ టాక్ – మాంచి ఫ్యాక్షన్ సినిమా చాలాకాలమైంది!

Balakrishnudu Movie Theatrical Trailer‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో మొదలైన ఫ్యాక్షన్ కధలు చివరికి తెలుగు ప్రేక్షకులకు బోర్ కొట్టించేసాయి. ఈ తరహా సినిమాలను తీసి, చివరికి చేతులు కాల్చుకున్న నిర్మాతలకు కూడా కొదవలేదు. ప్రస్తుతం అలాంటి కధలు తగ్గిపోయిన తరుణంలో… మాంచి ఫ్యాక్షన్ కధ అంటూ “బాలకృష్ణుడు” రూపంలో నారా రోహిత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ADVERTISEMENT

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల కాగా, గతంలో వచ్చిన రొటీన్ ఫ్యాక్షన్ కధల మాదిరే కనపడుతోంది. నారా రోహిత్ – రేజీనా – రమ్యకృష్ణ కాంభినేషన్ తప్పపెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. హీరోయిన్ ను వెంటాడే విలన్స్… ఆమెను రక్షించే హీరో… అత్తకు, అల్లుడుకు మధ్య విభేదాలు… క్లుప్తంగా “బాలకృష్ణుడు” కధ ఇలాగే కనపడుతోంది.

అయితే ‘లౌక్యం’ సినిమాను మలుపు తిప్పిన ’30 ఇయర్స్ పృధ్వీ’ కామెడీ ఈ ట్రైలర్ కు హైలైట్ గా కనపడుతోంది. ఇది కూడా కొత్తది కాకపోయినా కాస్త ప్రేక్షకులకు ఊరటనిచ్చే విధంగా పృధ్వీ క్యారెక్టర్ కనపడుతోంది. కమర్షియల్ ఫార్మాట్స్ కు దూరంగా చేసిన ప్రతిసారి విమర్శకుల ప్రశంసలు అందుకునే నారా రోహిత్, మరి కమర్షియల్ బొమ్మతో ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories