ఇరాన్‌ యుద్ధంలో మన భగవంత్‌ కేసరి!

Balayya Bhagavanth Kesari Iran clip

అవును. అఖండ-2లో పాకిస్తాన్‌ ఉగ్రమూకలను ఎదుర్కొని మట్టుబెట్టిన మన బాలయ్య, ఇప్పుడు అమెరికా- ఇరాన్‌ యుద్ధంలో కూడా కలుగజేసుకోక తప్పలేదు.

పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపించేస్తానని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, తాను స్వయంగా ఇరాన్‌తో మొదలుపెట్టిన యుద్ధాన్ని కూడా ఆపలేకపోతున్నారు.

ADVERTISEMENT

ఈ రెండు యుద్ధాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మీడియా ముందుకు వచ్చి ‘ఇరాన్‌ పని అయిపొయిందంటూ’ గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. మరో పక్క ఇరాన్‌తో యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇరాక్‌తో ఏకధాటిగా సుమారు 8 ఏళ్ళు యుద్ధం చేసినా చెక్కు చెదరని ఇరాన్‌ని, ట్రంప్‌ తక్కువ అంచనా వేయడం వల్లనే అయన ఈ ‘వీకెండ్ పిక్నిక్’ ఏడు నెలలుగా సాగుతోంది.

ఇరాన్‌పై ఆంక్షలు విధించి ఏకాకిగా చేస్తామని ట్రంప్‌ హెచ్చరికలకు ఇరాన్‌ ఘాటుగా సమాధానం ఇవ్వడం పెద్ద విచిత్రం కాదు. కానీ అందుకు మన బాలయ్య నటించిన ‘భగవంత్‌ కేసరి’ సినిమా క్లిప్‌తో సమాధానం చెప్పడమే విశేషం.

ఆ సినిమాలో ఓ గుహ బయట కుర్చీలో కాలుమీద కాలువేసుకొని టీవిగా కూర్చొన్న బాలయ్య.. అయనపై విలన్‌ గ్యాంగ్ తుపాకులతో దాడి చేయడం.. అప్పుడు బాలయ్య ఓ డ్రైనెజ్ హోల్ ప్లేట్ అడ్డం పెట్టుకొని ఆ తుపాకీ గుళ్ళను ఎదుర్కోవడం, ఆ తర్వాత వారిపై భారీ మెషిన్ గన్‌తో కాల్పులు జరిపే సన్నివేశాన్ని ఇరాన్‌ జింబాబ్వే ఎంబసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

“మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. మాతో యుద్ధం మొదలుపెట్టాక (ట్రంప్‌) హాలీవుడ్ సినిమాలు చూడటం మానేసి బాలీవుడ్‌ సినిమాలు చూస్తున్నారంటూ,” వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ ‘భగవంత్‌ కేసరి’ సినిమా క్లిప్‌ పెట్టింది.

ఇక్కడ అమెరికా-ఇరాన్‌ యుద్ధం పక్కన పెడితే, ఇరాన్‌ ఎంబసీ అధికారులు కూడా మన తెలుగు సినిమాలను ఇంతగా ఫాలో అవుతున్నందుకు చాలా సంతోషం కలుగుతుంది. పైగా బాలీవుడ్‌ అంటే టాలీవుడ్‌ అనుకోవడం కూడా మనకు గర్వకారణమే.

లేకుంటే ఎక్కడ జింబాబ్వే.. ఎక్కడ టాలీవుడ్‌. ఎప్పటి ‘భగవంత్‌ కేసరి’ సినిమా… మన తెలుగు సినిమా.. దానిలో మన బాలయ్య గురించి ఇరాన్ ఈవిధంగా గుర్తుచేసుకోవడం మనకి సంతోషమేగా!

ADVERTISEMENT
Latest Stories