ఇది రాజకీయాలలో కొత్త ఆవిష్కరణ?

BRS Party Balka Suman Arrest

బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే బాల్కా సుమన్‌ని నాంపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం ఆ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ నుంచి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మద్య తోపులాట జరిగింది.. అనేది రోజూ చూసే వార్తే.

ఆయన సింగరేణి కార్మికులకు మద్దతుగా మాట్లాడుతూ ఆవేశంలో సింగరేణి కార్యాలయం తగులబెట్టేయాలి అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వాటిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు పిర్యాదు చేయడంతో పోలీసులు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కానీ అయన పోలీసులకు లొంగిపోకుండా తెలంగాణ భవన్‌లో దాక్కొన్నారు. కనుక నేడు పోలీసులు అక్కడికే వెళ్ళి కార్యకర్తలను చెదరగొట్టి ఆయనని అరెస్ట్ చేశారు.

ADVERTISEMENT

ఆ తర్వాత వైద్య పరీక్షలు, కోర్టులో హాజరు పరిస్తే రెండు వారాల జ్యూడిషియల్ రిమాండ్… ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? అనే కేటీఆర్‌, హరీష్‌ రావు ప్రశ్నలు, తర్వాత బెయిల్‌ పిటిషన్‌ వంటి రొటీన్‌గా జరిగే తంతు గురించి అందరికీ తెలిసిందే.

ఒకసారి కేసు నమోదైతే ఇలాగే జరుగుతుందని ఎమ్మెల్యే బాల్క సుమన్‌కి తెలియదనుకోలేము. కానీ ఇటువంటి కేసులో చిక్కుకున్నా కూడా ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడే వీరుడుగా చిత్రీకరించుకోవాలంటే ఈ మాత్రం డ్రామా తప్పదు. ఆ డ్రామా పార్టీ కార్యాలయం వద్ద ఈవిధంగా జరిగితే ఇంకా బాగా రక్తి కడుతుంది.

పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించనవసరం లేదు గేటు దగ్డంగరకు వచ్చినా అది ప్రజాస్వామ్యంపై దాడి… ఖూనీ అని నిర్ధారించేందుకు మంచి మాటకారితనం ఉన్న నాయకులున్నారు. వారి సొంత మీడియా ఉంది. కొందరు మేధావులు కూడా సిద్ధంగా ఉంటారు.

కనుక తప్పులు చేసినవారిని పార్టీ కార్యాలయాలు కాపాడలేకపోవచ్చు కానీ హీరోలుగా మార్చగలవు. రాజకీయాలలో ఇదో కొత్త ఆవిష్కరణ అనుకోవాలేమో?

ADVERTISEMENT
Latest Stories