వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండీ రాష్ట్రంలోని అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలలోకి అక్రమంగా ప్రవేశించి దేవతామూర్తులను ఇరగ్గొట్టడం ఆనవాయితీగా మారింది. తాజాగా రామతీర్థంలో రాముడి విగ్రహం కొందరు దుండగులు ఇరగ్గొట్టి కోనేరులో పడేశారు.
దీనితో ప్రభుత్వం మీద భారీగా ఒత్తిడి వస్తుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి ఐన ఇటువంటి కేసులలో ఎటువంటి పురోగతి లేదు. మొన్న చంద్రబాబు పర్యటనతో ఈ విషయంలో టీడీపీ కంటే వెనుకబడిపోయాం అని బీజేపీ, జనసేన రేపు చలో రామతీర్థం అని పిలుపునిచ్చాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో బలప్రదర్శనకు అవుతున్నారు.
మరోవైపు… ఈ అంశంగా సెంటిమెంట్ రేకెత్తించడానికి… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ని త్వరలో ఏపీకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే బైబిల్ పార్టీ కావాలో … భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతమవ్వ బోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. అయితే తెలంగాణలో పని చేసిన మంత్రం ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తుందా అనేది చూడాలి. ఏపీలో ఆ పార్టీ నేతల వల్ల కాని పని… తెలంగాణ నుండి వచ్చిన బండి సంజయ్ అవుతుందా అనేది చూడాలి.





