చిరంజీవి అవార్డును అలా తీసిపారేసాడేంటి?

Bandla Ganesh Responds on Using Girls as Broker in Industryమెగా ఫ్యామిలీ హీరోలకు అవార్డులు రావడం లేవని బన్నీ వాసు, బండ్ల గణేష్ తదితరులు గొంతు చించుకుని చేస్తున్న వ్యాఖ్యలు మరింత అర్ధరహితంగా మారుతున్నాయన్న వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాలలో వినపడుతున్నాయి. ముఖ్యంగా ఒక ప్రముఖ నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సి.కళ్యాణ్ వంటి ఇతర నిర్మాతలు కాస్త తలంటే ప్రయత్నం కూడా చేయడం విశేషం.

రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మెగా హీరో కాదా? అంటూ జూరీ సభ్యులు చెప్తున్న మాటలకు… ఆ అవార్డు కేవలం కంటి తుడుపు చర్య అంటూ చిరంజీవి అవార్డును గడ్డిపరక మాదిరి బండ్ల గణేష్ తీసిపారేయడం విశేషం. దీంతో ఆగ్రహించిన జూరీ సభ్యులు రఘుపతి వెంకయ్య గారి విలువ తెలియకుండా మాట్లాడుతున్నారని, ఈయన ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా ఉన్నారన్న విషయం మరిచిపోయారని హితబోధ చేసే ప్రయత్నం చేసారు.

ADVERTISEMENT

ఆ తర్వాత ఈ డిబేట్ లో పాల్గొన్న మరో నిర్మాత సి.కళ్యాణ్ కూడా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపట్టారు. తన సోదరుడు అలా వ్యాఖ్యానించి ఉండకూడదని, తాను కూడా మెగా హీరోలకు అత్యంత చనువుగానే ఉంటాను గానీ, ఈ అవార్డులలో తనకేమీ ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చారు. ఈ కమిటీలో అల్లు అరవింద్ ఉండడం వలనే చిరంజీవికి అవార్డు ఇచ్చారా? అంటూ జూరీ సభ్యులు వేసిన ప్రశ్నలకు బండ్ల వద్ద మాత్రం సమాధానాలు లేకపోవడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories