చిన్న సినిమా మొదటి రోజు మొదటి ఆటకు అందరికీ ఫ్రీ టికెట్స్

Beach Road Chetan movie producers distributing free ticketsప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమా నిర్మాతలు రకరకాలుగా ప్రేక్షకులను ఆకర్షిస్తారు. ఇదే క్రమంలో ఒక్క చిన్న సినిమా నిర్మాతలు వినూతన ఆలోచన చేశారు. ఫస్ట్ ర్యాంక్ రాజు ఫేమ్ చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న బీచ్ రోడ్ చేతన్ నిర్మాతలు మొదటి రోజు మొదటి ఆటకు అందరికీ ఫ్రీ టికెట్స్ అని ప్రకటించారు.

ADVERTISEMENT

ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఏపీ, తెలంగాణలో ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఆ షోస్ లో వచ్చే పాజిటివ్ టాక్ తో సినిమాకు హెల్ప్ అవుతుందని నిర్మాతల ఆలోచన. దాదాపుగా 100 థియేటర్స్ లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఈ స్ట్రాటజీ కనుక సక్సెస్ అయితే మరిన్ని చిన్న సినిమాలు ఇదే ఫార్ములాను వాడే అవకాశం ఉంది. 22న ఈ సినిమాకు జార్జ్ రెడ్డి, తోలుబొమ్మలాట, మరికొన్ని చిన్న సినిమాలతో పోటీ ఉంటుంది. ఈ సినిమాలలో ప్రస్తుతానికి జార్జ్ రెడ్డి కు మాత్రమే హైప్ ఉంది.

జార్జ్ రెడ్డికి విడుదలకు ముందు రోజు హైదరాబాద్ లో చాలా థియేటర్స్ లో ప్రీమియర్లు వెయ్యడం విశేషం. ఆరోజు ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. తేజ రెడ్డి బీచ్ రోడ్ చేతన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా హైదరాబాద్ , వైజాగ్ లో చిత్రీకరణ జరిగింది.

ADVERTISEMENT
Latest Stories