హిట్స్ రాకపోయినా…ఆ కుర్ర హీరో బాగా బిజీ!

Bellamkonda Sai Srinivas-సహజంగా సినిమాల్లో హిట్స్ వస్తే కానీ చేతిలో వరుసగా సినిమాలు ఉండవు..ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే పెద్ద పెద్ద స్టార్స్ కే వరుస ఫ్లాప్స్ తర్వాత ఒక సినిమా కోసం చాలా గ్యాప్ వచ్చిన సంధర్భాలు చూశాం. కానీ ఈ కుర్ర హీరో మాత్రం ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో ఒకటి, రెండు సినిమాలు యావరేజ్ గా నిలిచినా, ఇప్పటివరకూ బ్లాక్ బష్టర్ హిట్ లేకపోయినా తాజాగా తాను నటించిన ‘కవచం’ డిజాస్టర్ అయినా నేను చాలా బిజీ డేట్స్ లేవు అంటున్నాడు.

[m9ad]

ADVERTISEMENT

ఇక ఇప్పటికీ అర్ధం అయి ఉండాలి…ఆ హీరో మనం బెల్లంకొండ వారసుడు బెల్లంకొండ శ్రీనివాస్ అని. ఈ హీరోకి అల్లుడు సీను మంచి పేరు అయితే తెచ్చి పెట్టింది కానీ వసూళ్ల పరంగా మాత్రం లాసే మిగిలింది. ఇక జయ జానకీ నాయక హిట్ రేస్ లో నిలిచింది, తప్పితే తాను నటించిన మిగిలిన సినిమా అలా వచ్చి వెళ్ళిపోయాయి. తాజాగా వచ్చిన కవచంతో సహా..అయితే సినిమాల పరంగా గ్రాఫ్ ఎలా ఉన్నా ఇంకా నాలుగు సినిమాలు చేతుల్లో ఉన్నాయట ఈ కుర్ర హీరోకి..

అందులో ఒకటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో సినిమా కాగా, మరొకటి రమేశ్ వర్మ అనే యువ దర్శకుడితో సినిమా, ఇక ఆ తర్వాత గోపించంద్ మలినేనితో ఒకటి అటుపై వీరభద్రంతో మరొకటి ఇలా వరుసగా నలుగురు దర్శకులతో సినిమా చేసేందుకు అప్పుడే డేట్స్ ఇచ్చేసాడట మన కుర్ర హీరో. మరి ఈ నలుగురు దర్శకులైనా మన శ్రీనివాస్ కి భారీ హిట్ ఇచ్చి ఈ కుర్ర హీరోని టాప్ హీరో చేస్తారో లేదో చూద్దాం మరి.

ADVERTISEMENT
Latest Stories