‘రచ్చ’ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటించిన “బెంగాల్ టైగర్” మాస్ ఎంటర్ టైనర్ గా టాక్ తెచ్చుకుంది. తొలి రోజు దాదాపుగా 5 కోట్లు పైనే వసూలు చేసిన ‘బెంగాల్ టైగర్,’ ఆ తర్వాత ‘ఏ’ సెంటర్స్ లో కాస్త జోరు తగ్గినప్పటికీ, బి, సి సెంటర్లలో కలెక్షన్ల దుమ్ము దులుపుతోందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద తొలి నాలుగు రోజులకు గానూ ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో కలిపి 16-18 కోట్లు కలెక్ట్ చేసి ఉంటుందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి కొంత మెరుగుగానే ఉన్నప్పటికీ, ఓవర్సీస్ లో మాత్రం ‘బెంగాల్ టైగర్’ దారుణ వైఫల్యాన్ని చవి చూసిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి నాలుగు రోజులకు గానూ కేవలం 97 లక్షలు మాత్రమే కొల్లగొట్టడంతో విదేశాల్లో పరాజయం ఖరారైంది. అయితే, శాటిలైట్ హక్కుల ద్వారా 7 కోట్లు రాబట్టడంతో నిర్మాత సేఫ్ జోన్ కు చెరుకున్నారని టాక్. ఈ వీకెండ్ వరకు ఇదే రకంగా గర్జిస్తే… డిస్ట్రిబ్యూటర్లను కూడా టైగర్ ఒడ్డున పడేసిన వారవుతారని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.





