చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు!

best chief minister award for chandrababu naiduఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారం వరించనుంది. పూణేలోని భారతీయ ఛాత్ర సంసద్ (బీసీఎస్) ఈ పురస్కారాన్ని ఈ నెల 30న అందజేయనుంది. మాయీర్ మిట్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, భారతీయ ఛాత్ర సంసద్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సంసద్‌ను నిర్వహిస్తున్నాయి. పూణే, కొత్రూడ్‌లోని మిట్ క్యాంపస్‌లో జరిగే వాలిడిక్టరీ సెరిమనీ సందర్భంగా చంద్రబాబు ఈ అవార్డు అందుకుంటారని, దేశవ్యాప్తంగా 10 వేల మంది విద్యార్థి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సంసద్ తెలిపింది. ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి గానూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

మహారాష్ట్ర శానన మండలి చైర్మన్ రామరాజే నాయక్ నీంబల్కర్ ఈ అవార్డును అందజేస్తారని, రాష్ట్ర హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి వినోద్ టాడే ఇందులో పాల్గొంటారని సంసద్ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థి నాయకులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆసియా, పశ్చిమ దేశాలకు చెందిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. ప్రజా జీవన ప్రమాణాలు పెంచేందుకు యువత రాజకీయాల్లో చేరేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వారు పేర్కొన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories