ఫ్యాన్స్ కు కావాల్సిన ‘పోస్టర్’ పడిందబ్బాయ్!

Bharat Ane Nenu 100 crores collectionsరెండేళ్ళ నుండి కడుపు కాలిన ఆకలితో ఉన్న ప్రిన్స్ అభిమానులకు “భరత్ అనే నేను” పంచభాక్ష పరమాన్నాలు పెట్టే పండగ శోభను తీసుకువచ్చింది. ఈ సమ్మర్ లో తమకు కాలర్ ఎగరేసుకునే సినిమాను అందించారని ఓ పక్కన సోషల్ మీడియాలో కొరటాల శివను అభిమానులంతా ప్రశంసలతో ముంచెత్తుతుండగా, మూడవ రోజున అభిమానులకు కావలసిన పోస్టర్ చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారికంగా వెలువడింది.

బాక్సాఫీస్ వద్ద బాబు బొమ్మకు పాజిటివ్ టాక్ వస్తే, ఫలితం ఇలాగే ఉంటుందని ఫ్యాన్స్ అంతా గర్వపడుతున్న నేపధ్యంలో… మూడవ రోజుకే 100 కోట్ల గ్రాస్ అందుకుందని ప్రకటించడం ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహంలోకి నెట్టే అంశమే. ఓ పక్కన యుఎస్ మార్కెట్ లో రెండో రోజుకే 2 మిలియన్స్ సొంతం చేసుకోవడం, ఓవరాల్ గా 100 కోట్లు గ్రాస్ రావడం… ఈ రెండు అనుభూతులు ప్రిన్స్ అభిమానులకు మరిచిపోలేని ‘సూపర్ సండే’గా మార్చేసాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories