‘భరత్ అనే నేను’లో క్లైమాక్స్ ఇలా!

Bharat-Ane-Nenu-Latest-Updates-Mahesh-Babuకొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో వీటి కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అంతకుముందే మరో ఫోటో అభిమానులను పలకరించింది.

ఈ సినిమాకు ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్న తిరు, ఈ సినిమా యొక్క షూటింగ్ అప్ డేట్ ను అందించారు. మహేష్ 24’వ సినిమా క్లైమాక్స్ జరుగుతోందంటూ షూటింగ్ లొకేషన్ పిక్ ను పోస్ట్ చేసారు. ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ, ఆ క్లైమాక్స్ లొకేషన్ ఎలా ఉంటుందనేది ఒక అవగాహన వచ్చేసినట్లయ్యింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories