వారసత్వం… మహేష్ కు బ్రేకులు వేసింది…!

Bharat-Ane-Nenu-Lucknow-schedule-cancelledగతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తన సినిమాల వేగాన్ని ప్రిన్స్ పెంచాడు. ఒకటి సినిమా పూర్తి కాక ముందే రెండు సినిమాలను లైన్లో పెట్టి, అదే వేగంతో షూటింగ్ కూడా పూర్తి చేయాలని భావించిన ప్రిన్స్ మహేష్ బాబు స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ కోసం ఇటీవల లక్నో వెళ్ళిన చిత్ర యూనిట్, ఈ నెల 23వ తేదీ వరకు అక్కడే షూటింగ్ జరపాల్సి ఉంది. కానీ నాలుగు రోజుల ముందే షూటింగ్ కు శుభంకార్డు వేసేసి చిత్ర యూనిట్ తిరుగు పయనం అయిపోయింది.

అయితే ఎందుకు ఇలా జరిగింది? అంటే… తమకు కావాల్సిన ప్రదేశాలలో షూటింగ్ లకు అనుమతి రాకపోవడంతో, ఇక లక్నోలో ఉండి ఉపయోగం లేదని తిరిగి వచ్చేసాము అని చెప్పారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాల ప్రసాద్. లక్నోలోని ఓ చారిత్రాత్మక ప్రదేశంలో షూటింగ్ చేయాలని భావించి అనుమతులు కోరగా, అక్కడ ఉన్న నియమ నిబంధనలు షూటింగ్ కు అనువుగా లేకపోవడంతో, ఈ షెడ్యూల్ ను అనుకున్న సమయాని కంటే ముందుగా కాన్సిల్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ADVERTISEMENT

షూటింగ్ చేసే సమయంలో చాలా మంది ఉంటారని, ప్రతి ఒక్కరిని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదని, వారసత్వపు సంపద అయిన సదరు బిల్డింగ్ లో గోడలను అంటుకోవడం కూడా చేయకూడదని, ఇది సాధ్యం కాదు గనుక షూటింగ్ ను విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా అనుమతులు లేకుండా కొరటాల లక్నోలో ఎందుకు షూటింగ్ ప్లాన్ చేసినట్లో తెలియాల్సి ఉంది. అసలే ‘స్పైడర్’ చివరి పాటకు సంబంధించి మొత్తానికి టైట్ షెడ్యూల్ లో ఉన్న మహేష్ డేట్స్ వృధా అయినట్లే!

ADVERTISEMENT
Latest Stories