భరత్ అనే నేను… ఇది షాకే గురూ..!

Bharat Ane Nenuమహేష్ బాబు సినిమాలు ఆలస్యం కావడం కొత్తేమీ కాదు. పూరీ దర్శకత్వం వహించిన ‘బిజినెస్ మెన్,’ దిల్ రాజు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఒకటి, రెండు సినిమాలు మినహాయిస్తే ప్రతి సినిమా కూడా వాయిదాలు పడుతూ రావడం చాలా రొటీన్ విషయం. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “భరత్ అనే నేను” కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ సినిమా ప్రారంభమైన రోజున ‘సంక్రాంతి విడుదల’ అని నిర్మాత దానయ్య చేసిన కామెంట్స్ ప్రిన్స్ అభిమానుల్లో జోష్ ని నింపాయి.

ADVERTISEMENT

కానీ ‘స్పైడర్’ వాయిదాల ప్రభావం ‘భరత్ అనే నేను’పై పడి, చివరికి ఏప్రిల్ 27వ తేదీన రిలీజ్ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంది. అయితే ‘స్పైడర్’ వాయిదాలు చూసిన అభిమానులకు, ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ నాటికైనా విడుదల అవుతుందా? అన్న సందేహం నెలకొంది. అయితే అలాంటి సందేహాలు నెలకొన్న వారికి “భరత్ అనే నేను” లేటెస్ట్ అప్ డేట్ షాక్ కు గురిచేస్తోంది. అవును… కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకుందనేది లేటెస్ట్ న్యూస్.

అంతేకాదు మార్చి నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవ్వనుందనే సమాచారంతో, ఖచ్చితంగా ఏప్రిల్ 27న విడుదల ఖాయం అని చెప్పుకోవచ్చు. బహుశా ‘స్పైడర్’ అనుభూతులతో మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేక కొరటాల శివ ఫుల్లు క్లారిటీతో షూటింగ్ చేస్తున్నారో గానీ “భరత్ అనే నేను” సినిమా షూటింగ్ సాగుతున్న తీరు మాత్రం ఇండస్ట్రీ వర్గాలలోనూ, అభిమానుల్లోనూ ఫుల్ పాజిటివ్ సంకేతాలను ఇస్తోంది. ఈ సారి బ్లాక్ బస్టర్ కావాల్సిందే అంటున్నారు ప్రిన్స్ అభిమానగణం.

ADVERTISEMENT
Latest Stories