పాటకు ముందు జోష్ ఫుల్ న్యూస్!

Bharat Ane Nenu Vachadayya saami ong releaseసోషల్ మీడియాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు దూసుకెళుతున్నాడు. టాలీవుడ్ హీరోల్లో ఎవరికీ లేనంత మంది ఫాలోవర్లు మహేశ్‌ బాబుకి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేశ్ ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్ల (60 లక్షలు) కు చేరింది. అంతమంది ఫాలోవర్లు ఉన్న మహేశ్‌ బాబు మాత్రం ట్విట్టర్‌లో ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. ఆయనే మహేశ్ బావ గల్లా జయదేవ్‌.

ADVERTISEMENT

మహేశ్ ట్విట్టర్‌లో తన సినిమాలకు సంబంధించిన వివరాలు తెలపడంతో పాటు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన విశేషాలను కూడా తెలుపుతాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘భరత్ బహిరంగ సభ’ పేరిట ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. మరికొద్ది నిముషాల్లో ‘వచ్చాడయ్యా సామి’ పాట విడుదల అవుతుందనగా తెలిసిన ఈ న్యూస్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది.

ADVERTISEMENT
Latest Stories