సూపర్ స్టార్ ఏం చేస్తారో?

Bharat ane nenuu Tamil release on krishna birthdayసూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గానీ, ఫస్ట్ టీజర్ ను గానీ విడుదల చేయడం ప్రిన్స్ మహేష్ బాబుకు పరిపాటి. అయితే ఈ సారి ఏకంగా సినిమానే విడుదల చేస్తున్నారు. తెలుగులో కాదులేండి, తమిళ, మలయాళ భాషలలో! తన తల్లి పుట్టినరోజున విడుదలై తన కెరీర్ లో మరపురాని సినిమాగా మిగిలిన “భరత్ అనే నేను” సినిమాను, తన తండ్రి కృష్ణ పుట్టినరోజు మే 31వ తేదీన తమిళ, మలయాళ భాషలలోకి విడుదల చేస్తుండడం విశేషం.

ADVERTISEMENT

తల్లి సెంటిమెంట్ అద్భుతంగా వర్కౌట్ కావడంతో, ఇప్పుడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సెంటిమెంట్ ఏ విధంగా ఉంటుందోనని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘స్పైడర్’ చిత్రం ద్వారా తమిళంలోకి రంగప్రవేశం చేసిన మహేష్ కు భంగపాటే ఎదురుకావడంతో, ‘భరత్ అనే నేను’ తమిళంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది. చెన్నైలో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డులే బద్దలు కొట్టడంతో, ట్రేడ్ వర్గాలలో తమిళ వర్షన్ పై అంచనాలు బానే ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories