మహేష్ ‘క్లాస్’ వర్సెస్ చరణ్ ‘మాస్’

Confident First Oath From Mahesh Babu Bharath Ane Nenuరిపబ్లిక్ డే సందర్భంగా అనుకోకుండా రెండు సినిమాల పోస్టర్లు సినీ ప్రేక్షకులను పలకరించాయి. అందులో ఒకటి ముఖ్యంగా “భరత్ అనే నేను” ఫస్ట్ లుక్ పోస్టర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విడుదల చేసిన ఈ పోస్టర్ కు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ‘స్టైలిష్ సిఎం’గా బ్యాక్ గ్రౌండ్ లో గాంధీ, అంబేద్కర్ బొమ్మలను పెట్టుకున్న మహేష్ బాబు లుక్ ఫ్యాన్స్ కే కాదు, సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా కావాల్సినంత కిక్ ఇస్తోంది.

ADVERTISEMENT

ఇలా క్లాస్ లుక్ ప్రిన్స్ దర్శనం ఇచ్చిన కాసేపటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కా మాస్ అవతారంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యారు. ఓ కోడి పుంజును పట్టుకుని హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్ చెప్పిన ‘చిట్టిబాబు’ గెటప్ పక్కా మాస్ లుక్ లో అదరగొడుతోంది. ఈ పోస్టర్ కూడా ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా రిలీజ్ చేయడంతో మెగా ఫ్యాన్స్ కు కన్నులవిందుగా మారింది. దీపం బుడ్డికి జాతీయ జెండా రంగు వేసి చెర్రీ వందనం చేస్తున్న ఈ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.

ఒకరు పక్కా క్లాస్ కాగా, మరొకరు పక్కా మాస్ పోస్టర్స్ లో దర్శనం ఇచ్చి అభిమానులకు ఈ గణతంత్ర్య దినోత్సవం మరపురానిదిగా మార్చేసారు. ముఖ్యంగా మహేష్ చిత్రాల అప్ డేట్స్ చెప్పిన టైంకే రావని అభిమానులే విమర్శలు చేస్తున్న నేపధ్యంలో… చెప్పకుండా విడుదల చేసి సర్ ప్రైజ్ చేసారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతా “భరత్ అనే నేను”తో మారుమ్రోగుతోంది. రెండు వరుస డిజాస్టర్స్ తో నీరసించిన ప్రిన్స్ ఫ్యాన్స్ కు “భరత్ అనే నేను” పబ్లిసిటీ ఫుల్ కిక్ ను ఇస్తోంది.

ADVERTISEMENT
Latest Stories