మోడీ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలిస్తే షాక్?!

Bichagadu behind Modi black money  ban of 500 1000 notes2016లో తెలుగులో సంచలన విజయం సాధించిన సినిమాలలో ‘బిచ్చగాడు’ ఒకటి. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు భాషలోకి అనువదించి విడుదల చేయగా, అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం వెనుక ఈ సినిమా ప్రభావం చాలా ఉందంటూ సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశం వైరల్ అవుతోంది.

ఇండియాలో పేదరికం తగ్గించడానికి ఒక సలహా చెప్పమంటూ రేడియో జాకీ అడిగే ప్రశ్నకు ఓ బిచ్చగాడు బదులిస్తూ… ఇండియాలో ఉన్న 1000, 500 నోట్లు రద్దు చేస్తే చాలు… అనే సీన్ సరిగ్గా ప్రస్తుతం మోడీ తీసుకున్న నిర్ణయానికి అచ్చు గుద్దినట్లుగా సరిపోతోంది. దీంతో మోడీ నిర్ణయం వెనుక ఈ బిచ్చగాడు సినిమా ప్రభావం ఉందని సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

చెప్పుకోవడానికి కాస్త హాస్యాస్పదంగా అగుపించవచ్చు గానీ, సినిమాల ద్వారా ఎంతటి మంచి వ్యాఖ్యలు చెప్పించవచ్చో ఈ ‘బిచ్చగాడు’ సినిమా సన్నివేశం నిరూపించింది. సినిమాలంటే అయిదు పంచ్ డైలాగ్ లు, నాలుగు కోతి డ్యాన్స్ లు, మూడు ఫైట్లు అని కొట్టిపారేసే వారికి, ఈ సీన్ ఒక గుణపాఠం లాంటిదని నెటిజన్లు అంటున్నారు. కాకతాళీయం అంటే ఇదేనేమో..! నాడు శశి అనే దర్శకుడు ‘బిచ్చగాడు’ ద్వారా చెప్పించిన విధానాన్నే నేడు దేశ ప్రధాని అవలంభించడం!

ADVERTISEMENT
Latest Stories