పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ తొలి సంచలనానికి చిత్ర యూనిట్ ఈ నెల 20వ తేదీన శ్రీకారం చుట్టబోతున్నారని విశ్వసనీయ సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆల్బమ్ ను మరో 15 రోజుల్లో అభిమానుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ముందుగా ఏపీలోని అమరావతిలో ఆడియో వేడుక నిర్వహించుకోవాలన్నప్పటికీ, తాజా పరిణామాల నేపధ్యంలో హైదరాబాద్ లోనే ఆడియో ఆవిష్కరణ వేడుక జరగనుందని, ఈ ఈవెంట్ ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్మాత పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని, మరో ఒకటి, రెండు రోజుల్లోనే ఇది ఫైనల్ కావచ్చని, అప్పుడు అధికారికంగా తేదీని ప్రకటించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని టాక్.
అత్యంత వైభవంగా సిద్ధం కాబోయే ఈ స్టేజ్ ను అదిరిపోయే సెట్ తో సిద్ధం చేయాలని నిర్మాత శరత్ మరార్ ప్లాన్ చేస్తున్నారట. అభిమానులకు కన్నుల పండుగగా ఉండే విధంగా ఈ ఈవెంట్ ను సిద్ధం చేయాలని పవన్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సెట్ డిజైన్ చేసే పనిలో ఉన్నారట నిపుణులు.





