నాని గారు అసలు విషయం చెప్పలేదు!

Big-Boss-Telugu-2ఐపీఎల్ హంగామా ముగిసింది… ఇక తెలుగు నాట బిగ్ బాస్ హంగామా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ నాచురల్ స్టార్ నాని ఓ ట్వీట్ కూడా చేసారు. జూన్ 10వ తేదీ నుండి ‘బిగ్ బాస్ 2’ ప్రారంభం కాబోతోందని, ఇది 100 రోజుల పాటు సాగనుందని, 16 మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొనబోతున్నారని స్పష్టం చేసారు. అంతా చెప్పుకొచ్చారు గానీ… ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ 16 మంది సెలబ్రిటీల గుట్టు మాత్రం విప్పలేదు.

ADVERTISEMENT

దీంతో 100 రోజుల పాటు ‘బిగ్ బాస్’ హౌస్ లో ఉండబోయే, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఆ 16 మంది సెలబ్రిటీలు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. హీరోయిన్లు రాశి, గజాలా, తేజస్వి, పూనం కౌర్, మాధవిలత, సింగర్ గీతామాధురి, యాంకర్ శ్యామల, హీరో తరుణ్ వంటి వారి పేర్లు గతంలో వినిపించాయి గానీ అధికారికంగా ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు. అలాగే సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నామని ఇటీవల ప్రోమోను కూడా రిలీజ్ చేసిన నేపధ్యంలో ఆ 16 మంది జాబితా ఆసక్తికరంగా మారింది.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ఈ సారి షూటింగ్ జరగబోతోంది. ఎన్టీఆర్ చేసిన షో అయితే ముంబై వెళ్ళాల్సి వచ్చేది, ఈ రకంగా నానికి కలిసి వచ్చినట్లే. అలాగే గత సీజన్ కేవలం 70 రోజులే ఉండగా, ఈ సీజన్ లో మరో 30 రోజులు పెంచడం విశేషం. మొదటి సీజన్ తో పోలిస్తే ఈ సారి కాస్త ‘మసాలా’ ఎక్కువుంటుందని అధికారికంగానే స్పష్టం చేయగా, ఏదైనా జరగోచ్చు అంటూ… నాని తాజాగా హింట్ ఇచ్చారు. ఫస్ట్ సీజన్ లో శివబాలాజీ విన్నర్ గా నిలువగా, రెండవ సీజన్ ఎవరి సొంతమవుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories