బిగ్ బాస్ సీజన్ -10 కోసం పొలిటికల్ స్టార్స్ అంటా..

Bigg Boss 10 Drawn Into Telangana Political Battle

బిగ్ బాస్ సీజన్ -10 కోసం ఇద్దరు కంటెస్టెంట్ లను సిఫారస్ చేస్తూ బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఒక లేఖ రాసారు కాంగ్రెస్ నాయకులు. అయితే ఈ ఇద్దరు నాయకులు పొలిటికల్ సెలబ్రెటీలు కావడం ఇక్కడ విశేషం.

అసలు విషయానికొస్తే., బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఇద్దరు కూడా బిగ్ బాస్ తరువాత సీజన్ లో ఉండాలంటూ, వారిని బిగ్ బాస్ హౌస్ కి తీసుకెళ్లాలంటూ కాంగ్రెస్ నేత ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నాగార్జున కు లేఖ రాసారు.

ADVERTISEMENT

రాజకీయ నటులుగా ఈ ఇద్దరు నేతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులని, వీరు అబద్దాలు చెప్పడంలో ఆరి తేరిన వారని, మోసాలు చేయడంలో వీరికి వీరే సాటని, ఇటువంటి వారిని బిగ్ బాస్ హౌస్ లోపల ఉంచితే వీరి అసలు స్వరూపం తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని, దాని ద్వారా మీ సీజన్ టీఆర్పీ రేటింగ్ విస్తృతంగా పెరుతుగుతుంది అంటూ హరీష్, కేటీఆర్ లని ఎద్దేవా చేసారు సాయి.

అయితే గత వారం రోజుల క్రితమే బిగ్ బాస్ సీజన్ – 9 విజయవంతంగా పూర్తి చేసుకుని కళ్యాణ్ పడాల విన్నర్ గా బయటకొచ్చారు. ఇక రాబోయే బిగ్ బాస్ సీజన్ 10 కోసం అధికార పార్టీ ఇలా ప్రతిపక్ష నాయకులను బిగ్ బాస్ ఇంటీ సభ్యులుగా తీసుకోవాలి అంటూ నాగార్జునకు సూచనలు చేయడంతో బిగ్ బాస్ ని తెలంగాణ రాజకీయ చదరంగంలో తీసుకొచ్చినట్లయ్యింది.

ఇక అధికార కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా బిఆర్ఎస్ సైతం ఈ బిగ్ బాస్ ని రాజకీయ రణరంగంలోకి లాగనుంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో మీద అనేక వివాదాలు నడుస్తున్నాయి. సిపిఐ నారాయణ సైతం బిగ్ బాస్ హౌస్ పై అనేక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ ఇటువంటి రియాలిటీ షో ల బాన్ చెయ్యాలంటూ హోస్ట్ నాగార్జున మీద కూడా విమర్శలు చేసారు.

ADVERTISEMENT
Latest Stories