తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. వందకు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి తెరాస రేసులో ముందు ఉంది. కాంగ్రెస్ మహాకూటమి కోసం చర్చలు జరుపుతుంది. అయితే బీజేపీ క్యాంపులో మాత్రం సందడి కనిపించడం లేదు. అమిత్ షా వచ్చి ఒక సభ పెట్టి వెళ్ళాక ఆ పార్టీ నేతలు ఎప్పటిలానే మిన్నకుండిపోయారు.
[m9ad]
అయితే అమిత్ షా, మోడీల పైనే తమ ఆశలు అన్ని పెట్టుకున్నారు ఆ పార్టీ వారు. అక్టోబరు తొలి వారంలో కరీంనగర్, ఆ తర్వాత వరంగల్‌తో పాటు తెలంగాణలో మరోచోట.. మొత్తం మూడు బహిరంగసభల్లో అమిత్‌షా పాల్గొంటారు. ఆ తర్వాత మోదీ ప్రచారం మొదలవుతుందని సమాచారం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ, జావడేకర్, స్మృతిఇరానీ ప్రచారానికి వస్తారు.
రాష్ట్రంలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సమ్మేళనాలు నిర్వహించే ప్రయత్నాలలో ఉన్నారట. తెలంగాణను కాషాయమయం చేయాలన్న సంకల్పంతో ఉన్న పరిపూర్ణనంద స్వామి కూడా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అనుకుంటే అనుకూలమైన చోట టిక్కెట్టు ఇవ్వడానికి పార్టీ సిద్ధం అన్నట్టు సమాచారం.





