భళా… ఒక్క సీటుతో ముగ్గురికి చెక్..!

Sujana Chowdary

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయబోతుందో అన్న ఆసక్తి పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వేళ, తాను పోటీచేయబోయే 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

నరసాపురం ఎంపీ స్థానానికి రఘురామకృష్ణంరాజు పేరు లేని వేళ రగిలిన అసంతృప్త రాగజ్వాల, నేడు ప్రకటించిన 10 అసెంబ్లీ స్థానాలతో కాస్త సర్దుమణిగినట్లయ్యింది. మరీ ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి బలమైన అభ్యర్థి సుజనా చౌదరి పేరు రావడం విమర్శలకు చెక్ పెట్టినట్లయ్యింది.

ADVERTISEMENT

టీడీపీ – జనసేన వర్గాలను సంతృప్తి పరిచే విషయం ఏమిటంటే, వైసీపీ అనుయాయులుగా భావించే బీజేపీ నాయకులు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావులకు ఇటు అసెంబ్లీ సీటు గానీ, అటు పార్లమెంట్ టికెట్ గానీ దక్కలేదు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత జరిగిన మంచి పరిణామంగా టీడీపీ – జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ ముగ్గురికి సీటు దక్కకుండా ఉండడం కోసం, పొత్తులో భాగంగా నరసాపురం నుండి ఆర్ఆర్ఆర్ సీటును టీడీపీ – జనసేనలు త్యాగం చేసినట్లుగా కనపడుతోంది. బీజేపీ నుండి బరిలోకి దిగకపోయినా, టీడీపీ తరపున అసెంబ్లీ స్థానికి ఆర్ఆర్ఆర్ బరిలోకి దిగడం ఖాయంగా పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.

కూటమి తొలినాళ్లలో పడిన అనిశ్చితి కాస్త రోజురోజుకు తొలగిపోతుండడం టీడీపీ – జనసేన వర్గీయులకు ఊరటనిచ్చే విషయం. ఇదే ఒరవడి మరో రెండు మాసాలు పాటు కొనసాగితే కూటమి మూడు పార్టీల జెండాలు ఏపీలో రెపరెపలాడడం పెద్ద కష్టమైన విషయమైతే కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

ADVERTISEMENT
Latest Stories