ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ మధ్య సొంత ప్రమోషన్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 2న ఆయన పుట్టినరోజు కావడంతో వ్యాప్తంగా 13 జిల్లాల్లో రక్తదాన శిబిరాలను మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఊదరగొట్టారు ఆయన.
అక్కడితో ఆగిపోయి ఉంటే సరిపోయేది. ఒక వీడియో పోస్టు చేసి అందులో పదమూడు రాష్ట్రాలలో తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు అంటూ కొన్ని ఫోటోలు పెట్టారు. మిగిలిన వాటి సంగతి తెలియాల్సి ఉన్నా తూర్పు గోదావరిలో జరిగిన రక్తదాన శిబిరం విషయంలో మాత్రం ఆయన దొరికిపోయారు.
రాజమహేంద్రవరంలో టీడీపీ వారు జరిపిన రక్తదాన శిబిరం ఫోటోను వాడేశారు విష్ణు. ఆ ఫొటోలో టీడీపీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫోటో కూడా కనిపిస్తుండడం విశేషం. బహుశా వీడియో చేసిన వారికి భవాని తెలియకపోవడం వల్ల ఆవిడని ఫోటో నుండి క్రాప్ చెయ్యలేదు.
గాంధీ జయంతి సందర్భంగా జిల్లాలలో నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాలు కూడా తన బర్త్ డే ఖాతాలో వేసేసుకున్నారు విష్ణు. ఆయన నెహ్రు యువ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఆ నామినేటెడ్ పదవిని కట్టబెట్టింది.




