ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా క్రేజీ ప్రాజెక్ట్ లు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ – బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “జై లవకుశ” ప్రాజెక్ట్. యంగ్ టైగర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న ఈ సినిమా సెట్స్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. దానికి సంబంధించిన ఫస్ట్ షాట్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దర్శకుడు బాబీ స్క్రీన్ లో చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ స్టిల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వరుస సక్సెస్ లతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, ఈ సినిమాలో తండ్రిగా ఒక పాత్ర, కొడుకులుగా రెండు పాత్రలలో కనిపించనున్నారన్న టాక్ తెలిసిందే. మరి ఫస్ట్ షాట్ ఎవరి మీద చిత్రీకరించారో చెప్పడం కష్టమే గానీ, బ్యాక్ యాంగిల్ లో తారక్ లుక్ అదరగొట్టేసాడు అంటున్నారు వీక్షకులు. ఈ సినిమా కధ విన్నవారంతా ‘జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుందని చెప్పడంతో’ జూనియర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



