వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గాను నకిలీ పత్రాలను, నకిలీ జీవోలను సృష్టించినట్టుగా సైబరాబాద్ పోలీసుల విచారణలో తేలింది. అందుకు తగ్గట్టే నేడు బొల్లా బ్రహ్మనాయుడు ని తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి హైద్రాబాద్ కి తరలించారు.
అటు పిదప న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కి తరలించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక నాయకుడు వచ్చి హైద్రాబాద్ లో సభ పెడతాను అంటేనే తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ ఏకమయ్యి పవన్ పై మూకుమ్మడి దాడి చేసారు.
పవన్ ను తెలంగాణ ద్రోహి అని ఒకరు, ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ మరొకరు, అసలు పవన్ హైద్రాబాద్ లో ఎలా అడుగుపెడతారో చూస్తాం అంటూ ఇంకొకరు ఇలా ఎవరిని నోటికి ఇష్టమొచ్చినట్టు వారు పవన్ పై విరుచుకుపడ్డారు.
ఇక రాజకీయ విశ్లేషకుడు పేరు చెప్పుకుని తన పై చేసిన నిరాధారమైన రాజకీయ ఆరోపణలను ఖండించినందుకు గాను దాన్ని తెలంగాణ సమాజం పై పవన్ దాడి చేస్తున్నారంటూ రెచ్చిపోయారు. ఇక పవన్ చెరువును కబ్జా చేసుకుని ఫామ్ హౌస్ నిర్మించుకున్నారంటూ వ్యక్తిగత ఆస్తులలోకి కెమెరాలు పెట్టి ఆధారాలు లేని ఆరోపణలు చేసారు.
మరి ఇప్పుడు తెలంగాణ పోలీస్ అధికారులే తమ విచారంలో బొల్లా హైద్రాబాద్ శివారులో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలను సృష్టించారని, నకిలీ జీవోలను ప్రచారం చేసారని తమ విచారణలో నిర్దారించారు.
అయినా కూడా తెలంగాణ రాజకీయ పార్టీల నాయకుల నుంచి బొల్లా కు వ్యతిరేకంగా కనీస స్పందన లేదు. నిన్నటి వరకు తెలంగాణ మీద దాడి, తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ బాబు, పవన్ ల పై నోరేసుకుని పడిపోయిన రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడు నోరెత్తలేకపోతున్నారు వై.? తెలంగాణ ఏర్పాటును బహిరంగా వ్యతిరేకించిన వైసీపీ అంటే మితిమీరిన ప్రేమానుకోవాలా.?
తెలంగాణలో టి. జనసేన సభకు అనుమతి నిరాకరించడం తో ఏకాభిప్రాయానికి వచ్చిన తెలంగాణ రాజకీయం, తెలంగాణ లో టీడీపీ విస్తరణ అంటే ఒప్పుకొని ప్రాంతీయవాదం ఇప్పుడు తెలంగాణ ఆస్తులను ఆక్రమించుకుంటే మాత్రం మౌన పాత్ర పోషిస్తుంది వై.? ఇది తెలంగాణ కు బొల్లా చేసిన అన్యాయం కాదా.?
ఆ ద్రోహాన్ని రాజకీయ కక్ష అంటూ వెనకేసుకొస్తున్న వైసీపీ విధానాన్ని ఏమంటారు.? ఆంధ్రా నాయకులు తెలంగాణ లో రాజకీయం చేస్తే సహించని వారు తెలంగాణ ఆస్తులను దోచుకునే వారి పట్ల సహనం వహిస్తున్నారా.? బొల్లా కు వ్యతిరేకంగా ముందుకొచ్చేందుకు జగన్ మీద వారికున్న రాజకీయ అనుబంధం వెనక్కి లాగుతుందా.?




