ఒకప్పటి పాపులర్ బాలీవుడ్ స్టార్ హీరోలను తెలుగు సినిమాల్లో విలన్లుగా పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంస్కృతి. చాలామంది బాలీవుడ్ హీరోలు.. సౌత్ కి షిఫ్ట్ అయ్యి తమ కెరీర్లను సెట్ చేసుకున్నారు. అక్కడి కమెడియన్స్ ను కూడా విలన్స్ గా ఓన్ చేసుకున్న ఘనత సౌత్ ఇండస్ట్రీది. కానీ.. ఇప్పుడు అదే బాలీవుడ్ విలనిజం బోర్ కి వచ్చేసింది. “యానిమల్”తో రీఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ ను ఆల్రెడీ “హరిహర వీరమల్లు, డాకు మహారాజ్” వంటి సినిమాలతో ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేసారు.
ఇమ్రాన్ హష్మీ పరిస్థితి కూడా అంతే. “ఓజీ” సినిమాలో పవన్ కళ్యాణ్ ముందు విలన్ గా చేసిన ఇమ్రాన్ ను “గూఢచారి 2”లోనూ విలన్ గా పెట్టుకోవడం, మరో రెండు సినిమాల్లోనూ అతను విలన్ గా కనిపించనున్నాడు అని తెలియడం అతడ్ని కూడా రెగ్యులర్ ఆర్టిస్ట్ గా మార్చేసింది.
ఇప్పుడు అనిల్ కపూర్ వంతు వచ్చింది. హిందీలో క్యారెక్టర్ రోల్స్ ప్లే చేయడం మొదలుపెట్టిన అనిల్ కపూర్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆల్రెడీ “వార్ 2”లో అనిల్ కపూర్ ని తెలుగోళ్లు చూసేశారు. అది సరిపోదన్నట్లు ఇవాళ విడుదలైన “ఆల్ఫా” చిత్రంలోనూ ఓ కీలకపాత్రలో అనిల్ కపూర్ కనిపించాడు. జాగ్రత్తగా గమనిస్తే “వార్ 2, ఆల్ఫా” సినిమాల్లో అనిల్ కపూర్ ఒకేలా కనిపిస్తున్నాడు. అది సరిపోదన్నట్లు 2027లో రానున్న ఎన్టీఆర్ “డ్రాగన్”లోను అనిల్ కపూర్ ఇదే విధంగా కనిపించనున్నాడని ఆల్రెడీ విడుదలైన టీజర్ తో క్లారిటీ వచ్చింది.
ఈ విధంగా అనిల్ కపూర్ “డ్రాగన్” రిలీజ్ అయ్యేసరికి జనాలకి ఆల్రెడీ బోర్ కొట్టేసి ఉండడం ఖాయం. మరి ఆ పాత్రతో సర్ ప్రైజ్ ఫ్యాక్టర్ ఎలా బిల్డ్ చేస్తాడు అనేది ప్రశాంత్ నీల్ కి పెద్ద సవాలుగా మారనుంది. దీన్ని ప్రశాంత్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఈ బాలీవుడ్ విలన్స్ ట్రెండ్ కి తెరపడే రోజు ఎక్కువ దూరంలో లేదు అనేది మాత్రం తెలుస్తోంది.



