పిక్ టాక్ – వికలాంగులందరికీ వ్యాధులు నయం చేసే ‘దేవుడు’

brother-sajith-joseph-grace-time-handicap‘తొండ ముదిరి ఊసరవెల్లి’ అవుతుందంటారు. అలాగే ‘మతం ముదిరి పైశాచికంగా’ మారుతోంది అని చెప్పక తప్పదు అనిపించేలా సదరు ఫోటోలోని వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ విశ్వంలో ప్రతిది సైన్స్ తోనే ముడిపడి ఉంది, ఏ దేవుడు, దెయ్యం లేదు అంటారు నాస్తికులు. అయితే, దేవుడు లేకుండా మనిషే లేకుండా, ఈ ప్రపంచాన్ని నడిపించేది దేవుడే అంటారు మరికొందరు. దేవుడు అనేవాడు ఎవరికీ కనిపించకపోయినా, నమ్మకం అనే ఒక ఆయుధం, ఈ ప్రపంచంలో మనిషి మేధస్సుకు అందని ఏదో అతీత శక్తులు ఉన్నాయన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

ADVERTISEMENT

అయితే ఇదే నమ్మకం మరికొందరికి వ్యాపారంగా కూడా మారిందని సదరు పోస్టర్ చెప్పకనే చెప్తోంది. ఇక్కడ మతాన్ని విమర్శించడం ఉద్దేశం కాదు గానీ, మతం పేరుతో సైన్స్ క్కూడా అందని అద్భుతాలను తానూ సాధిస్తానని చెప్పడం విమర్శలకు దారి తీసింది. ‘గుడ్డి వారు చూపు పొందుట, కంటి వారు నడుచుట, చెవిటి వారు వినుట, చూడాలని ఉందా… అయితే వచ్చేయండి అంటూ తేదీలు, వెన్యూల నను ఫిక్స్ చేసుకుని, ప్రకటనలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇలాంటి కొందరి స్వార్ధపరుల వలనే మొత్తం మతాధిపతులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories