కేసుల విచారణతో బిఆర్ఎస్ బలపడాలనుకుంటుందా.?

BRS Phone Tapping Case Sparks KTR-Harish Rao Political Show

పార్టీ ఓటమి, పార్టీ అధినేత అజ్ఞాతం కలిపి బిఆర్ఎస్ పార్టీ ని నైతికంగా, రాజకీయంగా బలహీనపరిచాయి. అటువంటి బిఆర్ఎస్ గత రెండేళ్లుగా సైలెంట్ మోడ్ లో సరైన అవకాశం కోసం కాచుకుని కూర్చుంది.

అయితే ఇప్పుడా అవకాశం ఫోన్ టాపింగ్ విచారణల రూపంలో అధికార కాంగ్రెస్ గులాబీ గూటికి చేర్చింది. ఇక దొరికిందే అదునుగా బిఆర్ఎస్ తన బలప్రదర్శనకు దిగుతుంది, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూస్తుంది.

ADVERTISEMENT

నిన్న హరీష్ విచారణ సమయంలో, నేడు కేటీఆర్ విచారణ నేపథ్యంలో బిఆర్ఎస్ లీడర్ల నుంచి క్యాడర్ వరకు చేసిన హడావుడి, హంగామా అంతాఇంతా కాదనే చెప్పాలి.

నాటి ఉద్యమ సమయంలో విద్యారులను ఎలా అయితే రెచ్చకొట్టి రాజకీయంలోకి తెచ్చారో అలానే నేటి విచారణ సమయంలో కూడా అదే విధంగా ఓయూ విద్యార్థులతో బిఆర్ఎస్ రాజకీయం నడుపుతుంది.

ఫోన్ టాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటు నేడు విచారణకు హాజరైన కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిట్ ముందుకెళ్లేందుకు తన ఇంటి నుంచి సిట్ కార్యాలయం వరకు పదుల సంఖ్యలో కార్లు వేసుకుని భారీ ర్యాలీ చేసారు.

ఇక అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ క్యాడెర్ ని, తన పార్టీ మద్దతుదారులను రెచ్చకొడుతూ, అధికార పార్టీ పై రెచ్చిపోతూ, ముఖ్యమంత్రి రేవంత్ పై దొంగ అంటూ విరుచుకుపడుతూ చివరికి విచారణకు హాజరయ్యారు.

ఈ మొత్తం ఎపిసోడ్ తరువాత అనూహ్యంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట కేటీఆర్ కోసం ఓయూ విద్యారులు నిరసనకు దిగారు. గత పదేళ్లు ఐటీ మంత్రిగా తెలంగాణ ను, హైద్రాబాద్ ని అభివృద్ధి చేసినందుకా కేటర్ పై ఈ విచారణ.?

నీటి ప్రాజెక్ట్ లతో తెలంగాణ భూములను తడిపినందుకా హరీష్ పై ఈ ఆరోపణలు అంటూ అటు హరీష్ ఇటు కేటీఆర్ కి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఓయూ విద్యార్థి నేతలు ప్రభుత్వం పై విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు.

విచారణల పేరుతో రేవంత్, కేసీఆర్ – కేటీఆర్ బ్రాండ్ వాల్యూ ని దెబ్బతీయాలని చూస్తున్నారని, హరీష్ రావు ని నైతికంగా, రాజకీయంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు, ఆందోళన చేపట్టారు ఓయూ విద్యార్థి నేతలు. దీనితో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

దీనితో గత రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న బిఆర్ఎస్ క్యాడర్ నిరసనల రూపంలో రోడ్డు మీదకు రావడానికి, ఓయూ విద్యార్థులు ఆందోళన పేరుతో రోడ్డు బాట పట్టడానికి రేవంత్ మార్గాన్ని చూపినట్టయ్యింది. అలాగే బిఆర్ఎస్ రాజకీయానికి సరైన సమయం వచ్చినట్లయ్యింది.

ఇక తెరవెనుక కేసీఆర్, తెరముందు కేటీఆర్, హరీష్ తన విశ్వరూపం చూపించేందుకు సిద్దమయినట్టేనా.? అన్న చర్చ ఊపందుకుంది. మరి బిఆర్ఎస్ నేతల అత్యుత్సాహానికి రేవంత్ ఎటువంటి కళ్లెం వేస్తారో.? వారి బలప్రదర్శనను ఎలా బలహీనపరుస్తారో అన్నది అటు కాంగ్రెస్ నేతలతో పాటు ఇటు తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories