BRS లో B అంటే బాబు.?

BRS politics controversy with Chandrababu Naidu focus in Telangana

ప్రత్యేక తెలంగాణ నే మా లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఇన్నాళ్లు కేసీఆర్ తన రాజకీయాన్ని నడిపారు. ఇక పార్టీ పెట్టిన లక్ష్యం నెరవేరడంతో పార్టీ పేరును తెరాస నుంచి బిఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ పార్టీ నుండి తెలంగాణ అనే పదాన్ని తొలగించారు.

అయితే భారతీయ రాష్ట్ర సమితి అంటూ మొదలైన బిఆర్ఎస్ రాజకీయ ప్రయాణంలో ‘B’ అంటే భారతీయ అంటూ సంబోధిన కేసీఆర్ ఆ దిశగా ఎన్నడూ పార్టీ రాజకీయాలను నడుపలేదు. గతకొంతకాలంగా B అంటే బాబు అన్నట్టుగానే బిఆర్ఎస్ రాజకీయం నడుస్తుంది.

ADVERTISEMENT

పార్టీ అధినేత కేసీఆర్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు, హరీష్ నుండి జగదీశ్ వరకు ఇలా బిఆర్ఎస్ పార్టీ లో నాయకులందరూ కూడా బాబు కేంద్రంగా రాజకీయం చేస్తున్నారు, ఆయన పేరు మీదనే తన పార్టీ ఉనికిని కాపాడుకుంటున్నారు.

రేవంత్ విధానాలను ఎత్తిచూపాలనా, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని దుయ్యబట్టాలన్నా, వైసీపీ కి తెరచాటు సాయమందించాలన్నా, బీజేపీ పై విమర్శలు ఎక్కుపెట్టాలన్నా అందుకు బిఆర్ఎస్ ఎంచుకునే పేరు చంద్రబాబు నాయుడు.

తెలంగాణలో ప్రాజెక్టులు ఆగినా అందుకు బాబే, ఏపీలో ప్రాజెక్టులు నిర్మించినా అందుకూ బాబే, తెలంగాణ ముఖ్యమంత్రి తుమ్మినా బాబే కారణం, ఏపీ ప్రతిపక్ష నేత దగ్గినా దానికి బాబే కారణం అంటూ బిఆర్ఎస్ నేతలు చేస్తున్న రాజకీయం చూస్తుంటే బిఆర్ఎస్ లో బి అంటే బాబు.? అనే సందేహం రాకమానదు.

తాజాగా మీడియా ముందుకొచ్చిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్ తన పాత బాస్ బాబు కి కోపం వస్తుందని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను పక్కనపడేసారంటూ బాబు పాఠం మొదలుపెట్టారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే కేసీఆర్ కి పేరు వస్తుందని, అందుకే దాన్ని పక్కన పెట్టి కాలువల ద్వారా నీళ్లు తవ్వడం మొదలుపెట్టారని అయితే ఇదంతా కూడా రేవంత్ తన గురువు చంద్రబాబు కోసమే చేస్తున్నారంటూ కేటీఆర్ తిరిగి బాబు జపం అందుకున్నారు.

తెలంగాణలో బిఆర్ఎస్ తిరిగి బలపడడానికి టీడీపీ ని ఎంతలా రెచ్చకొట్టినా బాబుని మరెంతలా తెలంగాణ రాజకీయాలలోకి లాగాలని చూస్తున్నా చంద్రబాబు మాత్రం తన పని తానూ చేసుకుంటూ పోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories