బిఆర్ఎస్ వాస్తు కరెక్షన్స్… కాలికి దెబ్బ తగిలితే చేతికి కట్టు!

telangana-bhavan-main-gate

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌కు వాస్తు, జాతకాలు, ముహూర్తాలపై ఎంత నమ్మకమో అందరికీ తెలుసు. వాస్తు సరిగా లేదని సచివాలయానికి వెళ్ళకుండా ఇంట్లో (ప్రగతి భవన్‌) నుంచి చాలా ఏళ్ళు పరిపాలన చేశారు. ఆ కారణంగానే పాత సచివాలయాన్ని కూల్చేసి, వందల కోట్లతో అమెరికా అధ్యక్షుడు అధికార నివాసం ‘వైట్ హౌస్’ని తలదన్నెలా పూర్తి వాస్తు ప్రకారం కొత్త సచివాలయం నిర్మించుకొన్నాకనే దానిలోకి అడుగుపెట్టారు.

ADVERTISEMENT

ఎన్నికలకు ముందు మహాచండీ సుదర్శన యాగాలు వగైరా కూడా చేశారు. అయినా ఎక్కడో తేడా కొట్టింది. ఎన్నికలలో ఓడిపోయారు.

టిఆర్ఎస్ పేరుని బిఆర్ఎస్ పార్టీగా మార్చడం వలననే ఓడిపోయామని పార్టీలో కొందరు వాదించారు. కాదు… కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించడం వలననే ఓడిపోయామని కేటీఆర్‌,హరీష్ రావు వాదిస్తున్నారు.

పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కి కొన్ని వాస్తు దోషాలు ఉన్నందునే ఈవిదంగా జరిగిందని వాస్తు నిపుణులు సూచించిన్నట్లు తెలుస్తోంది. కనుక వెంటనే వాయవ్య దిశలో ఉన్న గేటుని మూసేసి కొత్తగా ఈశాన్యంలో గేటు ఏర్పాటు చేయించారు.

ఇక మిగిలింది పార్టీ పేరు మార్పే. ‘కోట్లాది తెలంగాణ ప్రజలు, లక్షలాది పార్టీ కార్యకర్తల, నేతల అభీష్టం మేరకు ఏదో రోజు బిఆర్ఎస్ పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీగా మార్చినా ఆశ్చర్యం లేదు. కనుక ఇక బిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వచ్చేసిన్నట్లేనా?అంటే కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్‌, బీజేపీ, కోర్టులు, ఈడీ, సీబీఐలు వాస్తు పట్టింపులు లేవు. కనుక వాటిపై ఈ వాస్తు కరెక్షన్, నేమ్ కరెక్షన్ ప్రభావం చూపకపోవచ్చు.

కేసీఆర్‌ కష్టాల జాబితా చూస్తే అది అర్దమవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాగా, భూకబ్జా కేసులో అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణ జోరుగా సాగుతోంది. దానిలో ఎప్పుడు ఎవరి పేరు బయటపడుతుందో తెలీదు.

ఇంకా కాళేశ్వరం స్కామ్‌, ధరణీ పోర్టల్‌ కుంభకోణాలు, సచివాలయ నిర్మాణంలో చేతివాటం వంటి అనేక కేసులు ప్లాట్ ఫారం మీదకు వచ్చేందుకు సిగ్నల్ కోసం అవుటర్లో వెయిట్ చేస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలా ఎదురుచూస్తున్నాయి.

పదేళ్ళుగా లేని వాస్తు సమస్యలు ఇప్పుడే ప్రభావం చూపుతున్నాయా? దోషం వాస్తులో, పేరులో లేదు. మరెక్కడో ఉంది అని గిట్టనివారు వాదిస్తున్నారు.

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ప్రగల్భాలు పలికినందుకే ఇలా జరుగుతోందని కాంగ్రెస్‌లో చేరిపోతున్న బిఆర్ఎస్ నేతలు చెపుతున్నారు.

వారందరూ నమ్మక ద్రోహులు… కేసీఆర్‌ ఇచ్చిన పదవులు అనుభవించి పార్టీకి వెన్నుపోటు పొడిచారని కేటీఆర్‌ శాపనార్ధాలు పెడుతుంటే ఎవరూ సానుభూతి చూపడం లేదు! తిరిగి బిఆర్ఎస్ హిస్టరీ పాఠాలే వప్పజెపుతున్నారు.

కనుక కాలికి దెబ్బ తగిలితే చేతికి కట్టుకోవడం వలన ప్రయోజనం ఉండదని అర్దమవుతోంది. కానీ ఎక్కడో అక్కడ కట్టు కట్టుకోవడం మంచిదే కదా? అనుకుం

ADVERTISEMENT
Latest Stories