ఫిర్యాదు చేసిన “జవాన్ పరిస్థితి” ఇప్పుడు ఏంటో తెలుసా?

BSF Jawan Tej Bahadur Yadav VRS Newsనాసి రకం భోజనం పెడుతున్నారని ఆరోపించిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా? దేశవ్యాప్తంగా కలకలం రేపిన బహదూర్ యాదవ్ వీడియో పర్యవసానాల ఫలితం ఏమిటో తెలుసా? ప్రస్తుతం సదరు జవాన్ వాలంటరీ రిటరైమెంట్ సర్వీస్ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, సదరు దరఖాస్తును బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తిరస్కరించారు.

సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న తేజ్ బహదూర్ చేసిన ఆరోపణలపై చేపడుతున్న విచారణ, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అంశంపై విచారణలో పెండింగ్ లో ఉన్నందున వీఆర్ఎస్ దరఖాస్తును తిరస్కరించామని, ఈ విషయాన్ని గత నెల 30న బహదూర్ కు తెలియజేశామని అధికారులు పేర్కొన్నారు. కాగా, తేజ్ బహదూర్ ను బీఎస్ఎఫ్ అధికారులు బెదిరిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని, అరెస్టు చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు కొట్టిపారేశారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories