రాయాగా యాక్సెప్ట్ చేసి రావణుడిగా చూడగలరా ?

Yash as Ravana casting debate for Ramayan

సినిమాని సినిమాగా చూడాలి, క్యారెక్టర్ ని క్యారెక్టర్ లా చూడాలి అని ఎంత హితబోధ చేసినా.. మైథాలజీ సినిమాలు లేదా మన హిందూ దేవుళ్ల పాత్రలు పోషించే హీరోలు, హీరోయిన్ల విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే వచ్చాయి. సోషల్ మీడియా హడావుడి లేనప్పుడే బాపు రామాయణంలో సీతగా నయనతార ఎంపిక పట్ల తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుదేవాతో లివ్ ఇన్ లో ఉన్న ఒక లేడీని సీతగా ఎలా ఎంపిక చేస్తారు అని బాపు & బాలకృష్ణ మీద చాలా ప్రెజర్ కూడా పడింది.

ఈతరం రామాయణంగా వస్తున్న “రామాయణ్” విషయంలోనూ అదే స్థాయి విమర్శలు తలెత్తాయి. ఎద్దు మాంసం తినే రణబీర్ ను రాముడిగా ఎలా ఎంపిక చేస్తారు? అని సోషల్ మీడియా మొత్తం చాలా గోల జరిగింది. అది కూడా యానిమల్ లాంటి హింసాత్మక సినిమా తర్వాత రణబీర్ రాముడిగా కనిపించనుండడం అనేది చర్చకు దారి తీసింది.

ADVERTISEMENT

ఇప్పుడు “టాక్సిక్” తర్వాత యష్ ను రావణుడిగా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనే చర్చ మొదలైంది. ఎందుకంటే.. సినిమాలో లెక్కకుమిక్కిలి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని విడుదలైన ప్రతి ప్రోమోలో ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో, ఆగస్ట్ 26న విడుదలయ్యే టాక్సిక్ లో యష్ చేసే భీకరమైన యాక్షన్ తోపాటు హెవీ రొమాన్స్ చూశాక.. అతడ్ని నవంబర్ 8న విడుదలయ్యే “రామాయణ్”లో రావణుడిగా యాక్సెప్ట్ చేయగలరా? లేక మళ్లీ ఏమైనా డిస్కషన్స్ పెడతారా? అనేది చర్చనీయాశంగా మారింది.

ఇక్కడ రెండు రకాల విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. రావణుడు ఎంతటి శ్రేష్ఠమైన బ్రాహ్మణుడు, శివ భక్తుడు అయినప్పటికీ.. అతడు రాక్షసుడే కాబట్టి “టాక్సిక్”లో రాయాగా యష్ నటనను ఎంజాయ్ చేసి, “రామాయణ్”లో రావణుడిగా అతడ్ని యాక్సెప్ట్ చేస్తారా? లేక తిట్టుకుంటారా? అనేది చూడాలి.

ఏదేమైనా “కేజీఎఫ్” విడుదలైన 4 ఏళ్లకి ప్రేక్షకుల్ని “టాక్సిక్, రామాయణ్” సినిమాలతో ఒకే ఏడాది రెండుసార్లు పలకరించనుండడం అనేది ఇక్కడ విశేషం. మళ్లీ వచ్చే ఏడాది ఎలాగూ “రామాయణ్ పార్ట్ 2” ఉంటుంది. ఈలోగా వేరే ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా రెండు సినిమాలుంటాయి.

ADVERTISEMENT
Latest Stories